సూప‌ర్ ఎంటర్టైనింగ్ గా `ప్రేమ్ కుమార్` గ్లింప్స్‌..మీరు చూశారా?

September 1, 2021 at 10:33 am

`పేప‌ర్ బాయ్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి `ఏక్ మినీ కథ`తో హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఈయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో `ప్రేమ్ కుమార్‌` ఒక‌టి. అభిషేక్ మహర్షి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది.

Prem Kumar Movie Motion Poster | Santosh Shobhan | Latest Telugu Movies 2021 | Cinema Garage - YouTube

అయితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ వ‌దిలిన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటూ న‌వ్వులు పూయించింది. ఎన్ని పెళ్లి చూపులు చూసినా వ‌ధువు దొర‌క్క నానా తంటాలు ప‌డుతున్న చింతపిక్కల ప్రేమ్‌ కుమార్‌(సంతోష్ శోభ‌న్‌)కు.. ఎట్ట‌కేల‌కు ఒక అమ్మాయి దొరికుతుంది

Glimpse of Prem Kumar shows a hilarious peek into Santosh Sobhan's next | Telugu Movie News - Times of India

పెళ్లి వ‌ర‌కు వెళ్తుంది. కానీ, సరిగ్గా పెళ్లి సమయానికి వ‌ధువు లేచిపోతుంది. అస‌లు ఆ ఆమ్మాయి ఎందుకు వెళ్లిపోతుంది..? ప్రేమ్ కుమార్‌కు పెళ్లి అయిందా..? లేదా..? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికి సూప‌ర్ ఎంటర్టైనింగ్ గా మ‌రియు ఇంట్ర‌స్టింగ్ గా ఉన్న గ్లింప్స్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి లేటెందుకూ మీరూ ఈ గ్లింప్స్‌పై ఓ లుక్కేసేయండి.

సూప‌ర్ ఎంటర్టైనింగ్ గా `ప్రేమ్ కుమార్` గ్లింప్స్‌..మీరు చూశారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts