డైరెక్టర్ తేజ ఒక్కడికే.. ఎందుకు ఇలా జరుగుతోంది..?

డైరెక్టర్ తేజ.. ఎంత గొప్ప డైరెక్టర్ అంటే చిన్న సినిమాలకు కూడా అత్యంత విజయాన్ని చేకూరుస్తూ ఉంటాడు.. ఇదంతా ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేయకముందే అని చెప్పాలి. జయం, చిత్రం నాటి సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ తేజ ప్రత్యేకం అంటూ పిలిపించుకున్నాడు.. తేజ అంటేనే ఒక సంచలనం అనే లాగ చేసుకున్నాడు డైరెక్టర్ తేజ.. ఇకపోతే అదే స్పీడ్ తో దూసుకెళ్తున్న డైరెక్టర్ తేజ నిజం సినిమాతో ఒక్కసారిగా చతికిలబడ్డాడు.. ఈ సినిమా అందించిన పరాజయం ఇప్పటికీ ఆయన కోలుకోలేక పోతున్నాడు.. ఇక ఆ సినిమా తర్వాత ఒక్క విజయాన్ని కూడా తన సినీ కెరీర్ లో చూడలేదు.

ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్లీ తన జోరు చూపించడానికి సిద్ధమవుతున్నాడు అని అనుకునే లోపే, స్టార్ హీరోలతో సినిమాలు అనౌన్స్ చేసి అవి కూడా ఆగిపోతూ వచ్చాయి . ఇక ఇటీవల గోపీచంద్ తో అలివేలు మంగ తో వెంకటరమణ అనే సినిమా ప్రకటించారు. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మరొకవైపు రానాతో రాక్షసరాజు రావణాసురుడు కూడా ప్రకటించారు. ఇక దీని ఊసేలేదు.. దీంతో పెద్ద హీరోలతో చేస్తే ఆ సినిమాలన్నీ ఆగిపోతున్నాయి అంటూ మాటలు వినిపిస్తున్నాయి..

నేనే రాజు నేనే మంత్రి చేసి మంచి విజయాన్ని అందుకున్న ఆయన, ఆ తర్వాత సినిమాలు ప్రకటించాడు. అది కూడా ఆగిపోయింది.. ఇటీవల దగ్గుబాటి అభిరామ్ తో అహింస ఒకటే చేస్తున్నాడు.. అయితే ఇక ఈ సినిమా తర్వాత ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.