భార‌త్‌లో మ‌ళ్లీ ఊపందుకుంటున్న క‌రోనా..కొత్త‌గా ఎన్ని కేసులంటే?

పెను భూతంలా ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుంటోంది.

- Advertisement -

గ‌త కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 47,092 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,57,937 కు చేరుకుంది. అలాగే నిన్న 509 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ‌గా.. దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,39,529 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 35,181 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,20,28,825 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం 3,89,583 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, రోజూవారీ కేసుల్లో అత్య‌ధిక కేసులు కేర‌ళ రాష్ట్రంలోనే న‌మోదు అవుతున్నాయి. తాజా కేసుల్లోనూ 32,803 కేసులు కేర‌ళ నుంచే వ‌చ్చాయి.

Share post:

Popular