తల్లిదండ్రులకు హెచ్చరిక : సరికొత్త వేరియంట్ తో 10 మంది చిన్నారులు మృతి..?

 

కరోనా తన రెండు రూపాంతరాలు లతో అమాయక ప్రజల పైన దాడి చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ పేరిట చిన్నారుల ప్రాణాలకు అపాయం అని డబ్ల్యూహెచ్ఓ సంస్థ హెచ్చరిస్తునప్పటికీ, ఎక్కడో ఒక చోట ఏదో ఒక కారణం చేత చిన్నారులు మరణాలు వింటూనే ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు కూడా సరి కొత్త రకం వ్యాధితో ఏకంగా 10 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు…

“స్క్రబ్ టైఫస్ ” పేరిట చిగ్గర్స్ అనే ఒక కీటకం కుట్టడం వల్లే ఏకంగా కొంత మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారట. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో ఉన్న చిన్నారులు ఈ సరికొత్త వైరస్ బారిన పడినట్టు సమాచారం. మొత్తం 10 మందికి ఈ స్క్రబ్ టైఫస్ సోకగా అందులో ఇద్దరు పెద్దవాళ్ళు, ఎనిమిది మంది చిన్నారులు వుండడంతో అందరూ భయాందోళనకు గురి అవుతున్నారు.మథుర జిల్లాలోని కోహ్ గ్రామంలో 26 మంది, పిప్రోత్‌లో 3 మంది, రాల్‌లో 14 మంది, జసోడాలో 17 మందికి ఈ వ్యాధి సోకిందని తెలుస్తోంది.

ఆగ్రా, ఫిరోజ్ బాద్, మెయిన్‌పురి, ఎటా, కస్గంజ్ జిల్లాలో వ్యాధి సోకి మరణాలు సంభవించినట్టు మథుర జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రచన గుప్తా తెలిపారు. “ఓరియెంటియా త్సుత్సుగముషి “అనే బ్యాక్టీరియా వల్ల ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది అని డాక్టర్ రచన గుప్తా తెలిపారు.

ఇకపోతే ఈ వ్యాధి సోకిన 10 రోజుల వరకు ఒళ్ళు నొప్పులు జ్వరం శరీరం మీద పుండ్లు ఏర్పడటం దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పటివరకు ఈ వైరస్ కు టీకా కనుగొనబడలేదు కాబట్టి శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు లను పిల్లలకు వేయడం, చెట్లు, పొదల నుంచి దూరంగా ఉంచడం వంటివి చేయాలి.