కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ …?

దేశంలో అసంఘటిత రంగం కార్మికులు కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వలస కూలీలు, భవన నిర్మాణ కూలీలు ఆకలితో అలమటించిపోయారు. కాగా, కేంద్రం ఈ అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకుగాను కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. వారి కోసమై ‘ఈ-శ్రమ్’ అనే పోర్టల్ ప్రారంభించింది కేంద్రం. అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాలను ఈ పోర్టల్ ద్వారా డేటాబేస్‌లో స్టోర్ చేయనున్నారు. మొత్తంగా ఈ పోర్టల్ ద్వారా 38 కోట్ల మంది అసంఘటిత రంగా కార్మికులకు లబ్ధి చేకూరనుంది. రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభించనుంది. ప్రమాద ఇన్సూరెన్స్ కూడా లభించనుంది.

ఓ వ్యక్తి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయినా లేదా శాశ్వత వైకల్యం పొందినా రూ.2 లక్షల సాయం అందించనున్నారు. ఇకపోతే ఈ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన వారికి ఈ-శ్రమ్ కార్డులు కూడా ఇవ్వనున్నారు. 16 నుంచి 59 ఏళ్ల వయస్సున్న వారందరికీ ఈ-శ్రమ్ కార్డులు అందజేయనున్నారు. ప్రతీ ఒక్క అసంఘటిత రంగా కార్మకుడికి ఈ పోర్టల్ ద్వారా 12 డిజిట్స్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఇవ్వనున్నారు.