త‌గ్గేదే లే అంటూ `భీమ్లా నాయ‌క్‌`..ప‌వ‌న్ ఖాతాలో మ‌రో సూప‌ర్ రికార్డ్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్య దేవ‌ర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Pawan Kalyan, Rana Daggubati starrer Bheemla Nayak's FIRST glimpse takes internet by storm | WATCH | Regional-cinema News – India TV

అలాగే ఈ చిత్రంలో నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి కాక‌ముందే ఈ సినిమా త‌గ్గేదే లే అన్న రీతిలో రికార్డుల మోత మోగిస్తోంది. మొన్నీ మ‌ధ్య విడుద‌లైన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ భారీ వ్యూస్ ను పొందటమే కాకుండా, లైక్స్ ప‌రంగా ట్రెండ్ సెట్ చేసిన విష‌యం తెలిసిందే.

Image

అయితే ఇప్పుడు ప‌వ‌న్ ఖాతాలో మ‌రో సూప‌ర్ రికార్డు వ‌చ్చి ప‌డింది. ప‌వ‌న్ బ‌ర్త్‌డే కానుక‌గా సెప్టెంబ‌ర్ 2న విడుద‌లైన భీమ్లా నాయక్ టైటిల్ గ్లింప్స్ తాజాగా 1 మిలియ‌న్ లైక్స్‌ను సొంతం చేసుకుంది. దాంతో టాలీవుడ్‌లోనే అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన గ్లింప్స్‌గా రికార్డు సృష్టించింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అదికారికంగా తెలుపుతో ప‌వ‌న్ ఫ్యాన్స్ కోసం ఓ అదిరిపోయే పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.