గీతాంజలి గిరిజ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా?

కొన్ని సినిమాలు, అలాగే సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయి అంటే ఆ సినిమా వచ్చి కొన్ని ఏళ్ళు దాటినా కూడా ఆ సినిమాలోని పాత్రలు అలాగే సన్నివేశాలు గుర్తుండిపోతాయి. అలాగే ఆ సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటివాటిలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాగార్జున గిరిజా షెత్తర్ హీరోహీరోయిన్లుగా నటించిన గీతాంజలి సినిమా కూడా ఒకటి. ఇంగ్లాండులో పుట్టి పెరిగిన గిరిజ తన 18 ఏళ్ళ వయసులో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి భారత్ కు వచ్చింది. ప్రస్తుతం ఈమె లండన్ లో ఉంటుంది.

అయితే అప్పట్లో గిరిజా కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మంచి క్రేజ్ ఉన్నప్పటికీ కూడా ఆమె ఎక్కువ సినిమాల్లో నటించకపోయినా దానికి కారణం ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. అయితే సాధారణంగా హీరోయిన్లు తమకు వచ్చిన మూవీ ఆఫర్ను రిజెక్ట్ చేయడానికి అంతగా ఇష్టపడరు. అలాంటిది స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కూడా గిరిజ సున్నితంగా రిజెక్ట్ చేసేవారట. గిరిజ నటించిన హృదయాంజలి సినిమాకు ఏకంగా నాలుగు నంది అవార్డులు వచ్చాయి. అయితే ఒకానొక సందర్భంలో తాను సినిమాలు చేయడం పై డీజే అంబేద్కర్ వ్యాఖ్యలు చేసింది. పలువురు దర్శక నిర్మాతలు కథ పాత్ర చెప్పకుండా డేట్స్ అడిగారని,తనది డబ్బు కోసం సినిమాల్లో నటించే వ్యక్తిత్వం కాదని తెలిపింది. తాను తన అభిరుచికి సరిపోని సినిమాలకు తాను నో చెబుతూ వచ్చానని అంతకు మించి సినిమాలకు రిజెక్ట్ చేయడం వెనక ఎటువంటి కారణం లేదని తెలిపింది.