సిద్దార్థ్‌ చనిపోయాడంటూ పోస్టులు..ఎమోష‌న‌ల్ అయిన హీరో!

తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో సిద్ధార్థ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అయితే ఈయ‌న‌ చనిపోయాడంటూ.. ‘రిప్‌ సిద్దార్థ్‌’ అనే పోస్టులు గతంలో చాలా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది.

Rang De Basanti actor Siddharth features in the list of dead South actors; here's how he reacted | Celebrities News – India TV

నిన్న‌ యువ నటుడు, బిగ్‌బాస్‌ విన్నర్‌ సిద్దార్థ్‌ శుక్లా హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. అయితే కొంద‌రు నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియాలో అత్యుత్సాహం చూపిస్తూ సిద్దార్థ్‌ శుక్లా ఫొటోకు బ‌దులుగా హీరో సిద్ధార్థ్‌ ఫొటోని పెట్టి `రిప్‌ సిద్ధార్థ్‌` అని జోడించారు. దాంతో ఆ పోస్ట్ కాస్త వైర‌ల్‌గా మారింది.

Siddharth Shukla: Indian TV actor dies at 40 - BBC News

దీనిని గ‌మ‌నించిన సిద్దార్థ్‌.. స‌ద‌రు పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. `ఎవరో కొందరు తనను కావాలనే ఇలా వేధిస్తున్నారని, ద్వేషిస్తున్నారని` ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గ‌తంలో `యంగ్ ఏజ్‌లో మరణించిన సౌత్‌ ఇండియాకు చెందిన 10 మంది తారలు` అంటూ యూట్యూబ్‌లో అప్లోడ్ అయిన వీడియో థంబ్‌నైల్‌పై సిద్దార్థ్ ఫొటో ఉండ‌టం తీవ్ర క‌ల‌కలం రేపిన విష‌యం విదిత‌మే.

https://twitter.com/Actor_Siddharth/status/1433423447783182338?s=20