బాలయ్య సినిమాలో వర్షం బ్యూటీ అలా కనిపిస్తుందా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్ట్స్ మూవీని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అని అందరూ అనుకుంటుండగా, చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఈ సినిమాలో ‘వర్షం’ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో బాలయ్యతో ‘లయన్’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి బాలయ్యతో కలిసి నటించేందుకు ఓకే చెప్పిందట.

అయితే ఈ సినిమాలో త్రిష పాత్రకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో త్రిష ఓ గృహిణి పాత్రలో నటిస్తుందని, ఈ పాత్ర కోసం త్రిష చాలా బరువు పెరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. బాలయ్య లాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు త్రిష లాంటి స్టార్ బ్యూటీ అయితే బాగుంటుందని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమాలో త్రిష పాత్ర ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.