బంగార్రాజు కోసం ఇద్దరు పాపలు రెడీ

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’ షూటింగ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్‌గా వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఎప్పుడో స్టార్ట్ చేయాలని చూసినా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. కాగా రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన చిత్ర యూనిట్, వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తోంది.

అయితే ఈ సినిమాలో నాగ్‌తో పాటు పలువురు యంగ్ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య, కృతి శెట్టిలు ఈ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా మరో ఇద్దరు యంగ్ బ్యూటీలను ఈ సినిమాలో నటించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. యంగ్ బ్యూటీలు దర్శనా బానిక్, అక్షత సోనావానేలు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే వీరిని ఈ సినిమా కోసం ఓకే చేయించుకోగా, వారి పాత్రలు ఈ సినిమాలో ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

గతంలో సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో అనసూయ, హంసా నందిని, అనుష్క లాంటి బ్యూటీలు నటించి ఆ సినిమా సక్సె్స్‌లో తమవంతు పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ ఇద్దరు యంగ్ బ్యూటీలు కూడా అలాంటి పాత్రలను పోషించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రంతో మరోసారి ‘సోగ్గాడే చిన్నినాయన’ లాంటి బ్లాక్‌బస్టర్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.