బిగ్‌బాస్ 5కు ముఖం చాటేసిన మంగ్లీ..హౌస్‌లోకి మ‌రో స్టార్ సింగ‌ర్‌?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటి షో బిగ్ బాస్ సీజ‌న్ 5 సెప్టెంబ‌ర్ 5 నుండీ ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. సిజన్ 5కి కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇక ఇప్ప‌టికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి కాగా.. ప్ర‌స్తుతం వారంద‌రినీ క్వారంటైన్‌లో ఉంచారు నిర్వాహ‌కులు.

Singer Mangli photos on Karnataka public buses .. Penalty for being like  that .. - The Post Reader

ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ 5కు సంబంధించి ఓ క్రేజీ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ప్రతి సీజన్‌లో ఒక సింగర్‌ ఉన్నట్లే ఈసారి కూడా హౌస్‌లో ఒక సింగర్‌ ఉండాలని బిగ్‌బాస్‌ నిర్వాహకులు డిసైడ్ అయ్యార‌ట‌. ఇందులో భాగంగానే సింగ‌ర్ మంగ్లీని సంప్ర‌దించ‌గా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆమె ముఖం చాటేసింద‌ట‌.

Bollywood Celebrity Manager Contact Numbers - +91-87XXXXXXXXX: CONTACT  Sreerama Chandra Mynampati - Number +91 87585***3 For Event Booking,  Celebrity Manager Booking Actor Contact Details Live Show performance brand  endorsement Contact Number Official

దాంతో ఇప్పుడు ఈమె ప్లేస్‌లో ఓ స్టార్ సింగ‌ర్‌ను హైస్‌లోకి దింపబోతున్నార‌ట నిర్వాహ‌కులు. ఇంత‌కీ ఆ స్టార్ సింగ‌ర్ ఎవ‌రో కాదు..2010లో ఇండియన్‌ ఐడల్‌ టైటిల్ విన్న‌ర్ శ్రీరామచంద్ర. ఈయ‌న పాటలు పాడటంతో పాటు, పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్ర‌స్తుతం ఈయ‌న పేరు కూడా బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్ల లిస్ట్‌లో చేరింది. మ‌రి నిజంగానే శ్రీ‌రామ‌చంద్ర‌ షోలో అడుగు పెట్టబోతున్నాడా? లేదా? అన్న‌ది తెలియాలంటే సెప్టెంబ‌ర్ 5 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.