శ్రీదేవి నటించిన మొదటి చిత్రం ఏంటో తెలుసా..?

భారత సినీ పరిశ్రమను ఏలిన అతిలోకసుందరిగా శ్రీదేవి ఎంతో బాగా గుర్తింపు తెచ్చుకున్నది. శ్రీదేవి 54 సంవత్సరాల లోపు అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఇక ఆమె సినీ ప్రేక్షకులకు అందించిన మధురమైన జ్ఞాపకాలు, ఎన్నటికి చెరిగిపోని,కరిగిపోని, మధుర జ్ఞాపకాలు. ఈరోజు ఈమె పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఫోటో లను చూద్దాం.

శ్రీదేవి చూడడానికి ఒక బొమ్మ లా ఉండేది.. ఎన్ని తరాలు మారినా తరగని అందంగా ఉండేది. అందుకని శ్రీదేవి పేరు వినగానే అభిమాన గుండెలు పులకరిస్తాయి. ఇక చిన్నచిన్న కళ్ళతో, ప్రేక్షకులను నవ్విస్తూ మైమరిపించేలా చేస్తూ ఉంటుంది. ఈమె నిజంగానే అతిలోకసుందరి గా ఉండేది. మూడు తరాల హీరోలు సరసన నటించిన నటిగా పేరు పొందింది.

తన చిన్నతనంలోనే సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ ఒక స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నది శ్రీదేవి. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఏకఛత్రాధిపత్యం చేసినది ఈమె. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సైతం నటించింది. ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించింది. శ్రీదేవికి వేటగాడు,బొబ్బిలి పులి, క్షణం క్షణం, ప్రేమాభిషేకం వంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడు లో జన్మించింది. ఈమె నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే”కందన్ కరణమ్”అని ఒక తమిళ సినిమాలో బాలనటిగా నటించింది. ఆ సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఆ తర్వాత 16 సంవత్సరాలకే పెద్ద హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీదేవి, కమల్ హాసన్ కలిసి నటించిన వసంత కోకిల సినిమా ఈమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది.

ఆ సినిమాలో యాక్టింగ్ పరంగా శ్రీదేవిని అందరూ మెచ్చుకున్నారు. కొన్ని సినిమాలలో ఎన్టీఆర్ తో కలిసి మనవరాలిగా నటించిన.. శ్రీదేవి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా అతని పక్కన నటించింది.