`ఆర్ఆర్ఆర్‌` రిలీజ్‌కు కొత్త డేట్ లాక్‌..సందిగ్ధతలో స్టార్ హీరోలు?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. పాన్ ఇండియా లెవ‌ల్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్వతంత్ర సమరయోధుడు అల్లురి సీతారామ రాజుగా రామ్ చరణ్, గిరిజన యోధుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు.

Never-seen before kind of action sequence in 'RRR'

హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌, బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల అవుతుంద‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఆ తేదీకి ఆర్ఆర్ఆర్ రావ‌డం క‌ష్ట‌మే.

RRR New Poster and Updates: 'RRR' team gave a surprise to the fans. Also  released the new poster!

ఈ నేప‌థ్యంలోనే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కొత్త డేట్ లాక్ చేశార‌ట‌. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. వ‌చ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేస్తూ జనవరి 7వ తేదీన‌ ఆర్ఆర్ఆర్ ను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే సంక్రాంతి బ‌రిలో భీమ్లా నాయ‌క్, స‌ర్కారు వారి పాట‌, రాధే శ్యామ్, ఎఫ్ 3 వంటి భారీ చిత్రాలు విడుద‌ల కానున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఆర్ఆర్ఆర్ కూడా సంక్రాంతికే వ‌స్తుంద‌ని వార్త‌లు రావ‌డంతో.. ఆయా స్టార్ హీరోలు సందిగ్ధతలో ప‌డ్డార‌ని టాక్ న‌డుస్తోంది.