వ‌ర్మ వికృత చేష్టలు..కొత్త అమ్మాయితో ర‌చ్చ ర‌చ్చ‌!

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శివ సినిమాతో ట్రెండ్‌ సెట్‌ చేసిన ఆయన ఎన్నో సంచలన సినిమాలు తీసి టాప్‌ డైరెక్టర్‌గా మారాడు. కానీ రానురానూ వర్మ స్టైల్‌ మారింది. ప్రజలు ఆదరించినా, ఆదరించకపోయినా తనకు నచ్చినట్లు సినిమాలు తీస్తూ వ‌రుస ఫ్లాపుల‌ను మూట‌గ‌ట్టుకుంటున్నారు.

అలాగే ఏ విష‌యంలో అయినా ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించే వ‌ర్మ‌.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటారు. మొన్న‌టికి మొన్న అషూ రెడ్డిని కింద యాంగిల్ నుంచి ఫొటో తీసి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన వ‌ర్మ‌.. ఇప్పుడు మ‌రో కొత్త అమ్మాయితో ర‌చ్చ ర‌చ్చ చేశాడు. తాజాగా వర్మ `లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ` ఫేస్ బుక్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

అందులో ఫుల్‌గా డ్రింక్ చేసిన వర్మ బర్త్‌డే జరుపుకుంటున్న ఓ అమ్మాయిపై ఎక్కడెక్కడ చేతులేస్తున్నాడో కూడా తెలియనంతగా ప్రవర్తించాడు. పక్కన జ్యోతి, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు క్లాప్స్ కొట్టి మరీ ఎంకరేజ్ చేయ‌గా.. బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న స‌ద‌రు అమ్మాయి కూడా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అంద‌రూ నానా హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ కావ‌డంతో.. వ‌ర్మ వికృత చేష్ట‌ల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఎంజాయ్ చేయ‌డం త‌ప్పు లేదు గానీ.. వాటిని వీడియోలు తీసి అంద‌రికీ చూపించ‌డం ఎందుకూ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://www.facebook.com/100012512145287/videos/560741871639234/