ఎన్టీఆర్ వ‌ల్ల రాజీవ్‌ను ఘోరంగా అవ‌మానించిన రాజ‌మౌళి..ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహ బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రాజ‌మౌళి తెర‌కెక్కించిన `స్టూడెంట్ నెంబర్ 1` సినిమాతో ప‌రిచ‌య‌మైన వీరిద్ద‌రూ టాలీవుడ్‌లోనే మంచి స్నేహితుల‌గా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఎన్టీఆర్ హీరోగా న‌టించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ రాజీవ్ క‌న‌కాల క‌నిపిస్తాడు.

Jr NTR and Rajeev Kanakala friendship | When rumours about Jr NTR and Rajeev  Kanakala's friendship going kaput made headlines

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ న‌టిస్తున్న `ఆర్ఆర్ఆర్‌`లోనూ రాజీవ్ న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఓ సారి రాజీవ్‌ను దర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అంద‌రి ముందు ఘోరంగా అవ‌మానించాడ‌ట‌. అది కూడా ఎన్టీఆర్ కార‌ణంగానేన‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రీక‌ర‌ణ‌ స‌మ‌యంలో ఓ రోజు ఎన్టీఆర్‌కు చ‌ర్ల‌ప‌ల్లి జైలులో షూట్ ఉంద‌ట‌. అదే రోజు రాజీవ్‌కు షూట్ లేక‌పోవ‌డంతో ఇంటి ద‌గ్గ‌రే ఉన్నాడ‌ట‌. అయితే ఇంట్లో ఉన్న రాజీవ్‌కు ఎన్టీఆర్ ఫోన్ చేసి త‌న‌కు షూటింగ్ లేద‌ని అబ‌ద్ధం చెప్పి..బ‌య‌ట‌కు వెళ్దామ‌ని ర‌మ్మ‌న్నాడ‌ట‌.

17 Years Old Pic of Jr NTR & Rajamouli - tollywood

అది న‌మ్మి రాజీవ్ వెళ్ల‌గా.. ఎన్టీఆర్ బండిపై స‌రా స‌రి షూటింగ్ లోకేష‌న్‌కు తీసుకెళ్లాడ‌ట‌. దాంతో అక్క‌డే ఉన్న రాజ‌మౌళి.. రాజీవ్‌ను చూసి అంత ఎత్తు ఎగిరి ప‌డ్డార‌ట‌. `నీకు షూటింగ్ లేదు క‌దా అయినా ఎందుకు వ‌చ్చావ్‌? తార‌క్‌ను చెడ‌గొడ‌దామ‌నా?` అంటూ అంద‌రి ముందు అవ‌మానించాడ‌ట‌. ఓవైపు తార‌క్ తానే రాజీవ్‌ను తీసుకొచ్చాన‌ని చెబుతున్నా రాజ‌మౌళి మాత్రం విన‌కుండా తిట్టాడ‌ట‌. అయితే సీరియ‌స్‌గా కాదండోయ్‌.. రాజీవ్‌తో ఉన్న స‌న్నిహిత్యంతోనే రాజ‌మౌళి ఆయ‌న్ను తిట్టాడ‌ట‌.

Actor Rajiv Kanakala Sensational Comments About Junior Ntr Aparichithudu Jr NTR  Student No1 Nannaku Pramatho Interview With Rajeev - Telugu Movie Chanes  Rajamouli K-TeluguStop