చిరుపై నాగ‌బాబు పొగ‌డ్త‌లు..మండిప‌డుతున్న‌ ప‌వ‌న్ ఫ్యాన్స్‌?!

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న‌ మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. లైట్ పింక్ టీషర్ట్, జీన్స్ ధ‌రించి యంగ్‌ అండ్ డైనమిక్‌గా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలిచారు. దాంతో చిరు ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే చిరు లేటెస్ట్ లుక్‌పై బ్ర‌ద‌ర్ నాగ‌బాబు స్పందిస్తూ.. పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

 - Sakshi Post

ఈ నేప‌థ్యంలోనే నాగ‌బాబు త‌న సోష‌ల్ మీడియాలో మెగా హీరోల మ‌ధ్య‌లో చిరు ఉన్న పిక్‌ను షేర్ చేశారు. అంతేకాదు.. `ఈ పిక్‌లోని మెగా హీరోలందరిలో మీరే యంగ్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన జనరేషన్ కానీ, రాబోయే జనరేషన్‌లో కానీ ఎవరూ మిమ్మల్ని బీట్ చేయలేరు అన్నయ్య` అని కామెంట్ కూడా పెట్టారు.

Mega Brother Nagababu: ఒకే ఫేమ్‌లో మెగా హీరోలు .. పవన్ కళ్యాణ్ ఫోటోని మిస్  చేసిన నాగబాబు.. ఫీలవుతున్న ఫ్యాన్స్ | Mega brother Nagababu Shares A  Beautiful Family Pic.. pawan kalyan ...

దాంతో నాగ‌బాబుపై ప‌వ‌న్ క‌ళ్యాన్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఎందుకంటే.. నాగబాబు షేర్ చేసిన ఈ ఫొటోలు మెగా కాంపౌండ్ హీరోలందరూ కనిపించారు కానీ పవన్ కళ్యాణ్ మిస్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే రంగంలోకి దిగిన‌ పవన్ ఫ్యాన్స్ మా హీరో ఎక్కడ? ప‌వ‌ర్ స్టార్‌ను ఎందుకు మిస్ చేశారు? అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.