ఇండియన్ ఐడల్ కు విజయ్ సూపర్ ఆఫర్..!

ఇండియాలో అతి పెద్ద సింగింగ్ రియాల్టీ షో ఏదైనా ఉందంటే అది ఇండియన్ ఐడల్ మాత్రమే అని చెబుతారు. మరి అటువంటి షోకు చాలా మంది ఎంపికై తమ ప్రతిభను చాటుతారు. టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది సింగర్స్ పోటీనిచ్చినప్పటికీ ఇప్పటికీ కొంతమందే చివరి వరకూ నిలిచారు. వారిలో ఒకరిద్దరూ ఫైనల్ చేరుకుని ఇంటి ముఖం పట్టారు. తాజాగా ఇప్పుడు జరుగుతున్న ఇండియన్ ఐడల్ 2021లో గ్రాండ్ ఫినాలే జరుగుతోంది. ఇందులో ఓ తెలుగమ్మాయి ఫైనల్ కు చేరింది. ఆమెవరో కాదు షణ్ముక ప్రియ.

ఫైనల్ సందర్భంగా టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ హీరో అయిన విజయ్ దేవరకొండ షణ్ముక ప్రియకు శుభాకాంక్షలు తెలియజేశాడు. విజయ్ దేవరకొండకు షణ్ముక ప్రియ అభిమానినని తెలిపింది. తాను విజయ్ మూవీలో పాట పాడాలని తన ఆశను వెలిబుచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ ఆమెకు విషెస్ చెప్పాడు. తాను తన మూవీలో పాడే అవకాశాన్ని ఇస్తున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.