ధనుష్ కు మొదలైన లీకుల బెడద .?

August 28, 2021 at 8:14 pm

ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా లీకుల బెడద తప్పేటట్లు లేదు.కొత్త సినిమాలు షూటింగ్ మొదలవుతున్న సమయంలో కొన్ని ఫోటోలు సన్నివేశాలు లీక్ అవుతున్నాయి.ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ సమస్త లాంటి బడా బాబులు కూడాఈ బెడద నుంచి తప్పించుకోలేక పోతున్నారు.

ఇక ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ కు కూడ లీకుల బెడద ఎక్కువైపోయింది.పుష్ప సినిమాలో కూడా 2, 3 ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సర్కారు వారి పాట సినిమా నుంచి కూడా ఒక ఫోటో లీక్ అవ్వడం జరిగింది.

టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్లో కూడా ఈ లీకుల బెడద తప్పేటట్లు లేదు.మన హీరో ధనుష్ తీయబోతున్న సినిమాకు సంబంధించి ఒక ఫోటో లీక్ అయింది. ఆ ఫోటో కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.కోలీవుడ్లో ఈ సినిమాకు డైరెక్టర్ గా మిత్రాన్ జవహర్ చేస్తున్నాడు. కమర్షియల్ ఎంత టైం మూవీ గా చిత్రని తీస్తున్నారు. ఈ సినిమాలో హీరో ధనుష్, హీరోయిన్ రాశి ఖన్నా నటిస్తున్నది.

అయితే ఆగస్టు 5న ధనుష్ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది ఈ సినిమాకు షూటింగ్ చాలా తొందరగా జరుగుతోంది.ఆ లీకైన ఫోటోలో ఇద్దరూ కేఫ్ బయట నిలబడి ఉన్నారు.ధనుష్ మాత్రం తన గుండె మీద చేయి వేసుకుని ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నట్లు ఫోటోలో ఫోజ్ పెట్టాడు.ఇంకో పక్కన రాసి ఖన్నా పింక్ డ్రెస్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తోంది.

ఇక ఈ ఫోటోను ఎవరో తెలియని వ్యక్తులు పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సినిమా నిర్మాతలు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఇలాంటి లీకులు ఇంకోసారి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.ఇలా సినిమాల నుంచి ఫోటోలు కానీ సీన్లు గాని లీక్ అయితే సినిమాను చూడడానికి ప్రేక్షకులు ముందుకు రారు అని నిర్మాతలు వాపోతున్నారు.

ధనుష్ కు మొదలైన లీకుల బెడద .?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts