కోర్టు తీర్పుపై గాఢంగా స్పందించిన తాప్సీ..?

టాలీవుడ్ లో తనదంటూ ఒక స్టైల్, ఇమేజ్ ను పెంచుకున్న ఈ అమ్మడు , ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో నటించడం లేదు. అంతేకాకుండా ఈమధ్యకాలంలో ఎక్కువగా వాణిజ్య ప్రకటనలలో ఈ ముద్దుగుమ్మ కనిపిస్తోంది. మరి ఇంతకు ఈ అమ్మడు వేరే సినిమాలలో నటిస్తోందా..? లేదా..? చూడాల్సిందే.. ఈ హీరోయిన్ ఎవరో కాదు తాప్సీ. ఈమె మాటలు కుండలు బద్దలు కొట్టేలా ఉంటాయి.

హిందీ మూవీలో పింక్ చిత్రంలో నటించింది. ఈ మూవీ ద్వారా తాప్సి కి ప్రశంసలు బాగానే అందాయి. ఛాలెంజింగ్ రోల్స్ ,స్ఫూర్తినిచ్చే కథలో తాప్సీ నటించి మెప్పించింది. తాజాగా ఈ మధ్య కాలంలో ఒక రేప్ కేస్ గురించి, ఇటీవల వచ్చిన తీర్పుపై తన అభిప్రాయాన్ని చెప్పింది. తాప్సీ నే కాకుండా పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ విషయం గురించి కొన్ని అభిప్రాయాలను చెబుతున్నారట.

ఇటీవల కాలంలో ఒక తీర్పును కూడా చర్చించడం జరిగింది. చట్టబద్ధమైన వివాహం లో భార్యతో బలవంతపు శృంగారం తప్పేమీ కాదని హైకోర్టు వెల్లడించింది. వైవాహిక జీవితంలో ఇలాంటివి సహజం కాబట్టి భర్త ని నిర్దోషిగా ప్రకటించింది. భార్యకు ఇష్టం లేకుండా శృంగార చర్యలను నేరం కాదని పరిగణిస్తున్నట్లు పేర్కొంది.

18 సంవత్సరాలు ఎక్కువగా ఉన్న భార్యతో తన భర్త శృంగారంలో పాల్గొంటే తప్పేమీ లేదని రేప్ గా పరిగణించలేమని హైకోర్టు చెబుతోంది. ఒకవేళ భార్యకి ఇష్టం లేకపోయినా భర్త బలవంతపు శృంగారం చేసిన తప్పేమీ లేదంటూ హైకోర్టు నిర్ణయం ఇచ్చింది.

తాప్సీ పన్ను ట్వీట్ చేస్తూ ఈ విషయం మాత్రమే మిగిలింది.. వినటానికి అని పరోక్షంగా తన అభిప్రాయాన్ని పంచుకుంది. కోర్టును గౌరవిస్తూ తాప్సీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే మోహపాత్ర, గాయని సోనా కూడా సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు. ఈ మ్యాటర్ విన్న తరువాత ఫీలయ్యాను అంటూ,తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.