ది ఫ్యామిలీ మాన్ – 3లో అవకాశం కొట్టేసిన యంగ్ హీరో..!

ఆ హీరో మూవీ తీస్తే అందులో విభిన్న పాత్రలను ఎక్కువగా పోషిస్తాడు. ఆయన తీసిన బీరువా సినిమా కానీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా కానీ ఇలా వేరు వేరు గా ఆలోచించి తీయగల సత్తా ఉన్న నటుడు..ఆయన తీసిన బీరువా సినిమా అంటేనే తెలిసిపోయి ఉంటుంది. అవునండి..ఆయనే సందీప్ కిషన్ .. ఈ మధ్యకాలంలో ఈయన ఒక సినిమాను తీస్తున్నాడు.ఇక ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కావడానికి ఎదురు చూస్తోంది.

2019లో అమెజాన్ ప్రైమ్ లో వచ్చినది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో మన హీరో సందీప్ కిషన్ నటించాడు. ఇక ప్రేక్షకాదరణ ఈ సినిమాకు చాలా ఎక్కువే.. ఈ సినిమాలో సందీప్ పాత్ర కొంచమే అయినప్పటికీ అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఈ క్రమంలో ది ఫ్యామిలీ మ్యాన్ 3 మూవీలో అడుగు పెడుతున్నానని చెప్పారు. ది ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సీజన్ లో ఉన్న సందీప్ కిషన్, సీజన్ 2 లో కనిపించలేదు. సీజన్ 2 లో సమంత అక్కినేని ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ పాత్ర లేకపోవడంతో అతన్ని పక్కకు నెట్టారు. అయితే రాబోయే సీజన్ ను నార్త్ ఈస్ట్ లో ప్లాన్ చేయబడింది. ఈ సీన్ కు సందీప్ కిషన్ నటించే అవకాశం ఉంది. అని కొన్ని వార్తలు వచ్చాయి.

Sundeep Kishan joins a web series! - Tamil News - IndiaGlitz.com

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ రాజ్_డీకే రూపొందించే ది ఫ్యామిలీ మ్యాన్ లో నటిస్తానని అది కూడా రాబోయే మూడో సీజన్లో నటిస్తానని కన్ఫామ్ గా చెప్పారు.