ఈనాడు పేప‌ర్ కు కార్టూనిస్ట్ శ్రీ‌ధ‌ర్ రాజీనామా…?

ఈనాడులో ఎప్పటి నుంచో కార్టూన్లు వేసి ఉర్రూతలూగిస్తున్నా ఆ కలం ఇక కనపడదు. తెలుగు వారికి ఆ కార్నర్ పేజీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నవ్వును పూయిస్తుంది. తమాషా చేస్తుంది. శ్రీధర్ కుంచె నుంచే జాలువారే ఆ కార్టూన్లు ఎందరినో రంజిపజేస్తాయని అనడంలో సందేహం లేదు. మరి అంతటి ఖ్యాతి గడించిన శ్రీధర్ ఈ మధ్యకాలంలో అనారోగ్యపాలు అయ్యారు. అందుకే ఆరోగ్య కారణాల రీత్యా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఈ విషయం తెలియగానే చాలా మంది బాధపడ్డారు. రాజ‌కీయ వ్యాఖ్యానాల‌తో త‌న‌దైన ఎత్తిపొడుపు రేఖ‌ల‌తో తెలుగు ప‌త్రికా రంగానికే ఓ ప్ర‌త్యేక ఇమేజ్ ను శ్రీధర్ క్రియేట్ చేశారు. క‌మ్యూనిస్టు భావ‌జాలం ఉన్న శ్రీధర్ ఎన్నో కార్టూన్లు వేసి ఒక గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య కారణాల రీత్యా తన ఉద్యోగాన్ని కొనసాగించలేనని తెలపడంతో తెలుగువారు బాధపడుతున్నారు.