ఆంధ్రలో కొత్త కరోనా రూల్స్..?

కరోొనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ తగ్గినప్పటికీ రాబోయే ప్రమాదంపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా రూల్స్ ను చాలా మంది బ్రేక్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు పెట్టక తప్పలేదు. ఏపీలో అయితే కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఏపీ సర్కార్ మరోమారు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏపీలో సరిహద్దు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

అటు కర్ణాటక, ఇటు తమిళనాడు రాష్ట్రాల నుంచి చాలా మంది ఏపీకి తరలివస్తుంటారు. ఇంకా చెప్పాలంటే తిరుమల శ్రీవారి దర్శనానికి నలుమూలల నుంచి వస్తారు. ఇటువంటి తరుణంలో ఏపీ సర్కార్ ఇకపై పెళ్లిళ్లు జరిగితే కచ్చితంగా 150 మందే ఆ వేడుకకు హాజరు కావాలనే నిబంధనను నిర్ణయించింది. పెళ్లిలో ఒకరి పక్కన ఒకరు ఉండకుండా ఖాళీగా ఉంచాలని తెలిపింది. ఒక సీటుకు మరో సీటకు కనీసం 5 అడుగుల ఖాళీని ఉంచాలని తెలిపింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అయిన అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు.