హాట్ డ్యాన్స్‌తో హీటెక్కిస్తున్న న‌టి ప్ర‌గ‌తి..వీడియో వైర‌ల్‌!

న‌టి ప్ర‌గ‌తి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ స్పెష‌ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్ర‌గ‌తి.. సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా లాక్ డౌన్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచీ ఫొటోలు, వర్కవుట్‌ వీడియోలు, డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తుంటుంది.

అలాగే సినిమాల్లో చాలా పద్దతిగా కట్టు బొట్టుతో ఆకట్టుకునే ప్రగతి .. సోష‌ల్ మీడియాలో మాత్రం సూప‌ర్ హాట్‌గా క‌నిపిస్తూ అల‌రిస్తుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆర్‌.రెహ్మాన్ పాట‌కు త‌న‌దైన శైలిలో డాన్స్ చేసి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో ప్ర‌గ‌తి ఘాటైన అందాలతో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ తన ఫాలోవర్స్‌ని రంజింపజేస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో ప్రేక్ష‌కుల‌కు తెగ ఆక‌ట్టుకుంటోంది. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ ప్ర‌గ‌తి ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని ఈ వీడియో బ‌ట్టీ స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.

Share post:

Latest