అలాంటి పాత్ర చేయాలనుంది.. పూజా

August 16, 2021 at 4:56 pm

పూజా హెగ్డే.. నాగచైతన్య సరసన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా , సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పూజాహెగ్డే , అతిత్వరలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది.. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది పూజా హెగ్డే. ఇక టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తూ ..మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా బిజీ అయిపోయింది.

ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధే శ్యాం తో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల షూటింగ్ లను కూడా పూర్తి చేసుకొని, రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే రాదే శ్యాం సినిమాను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న సినిమా కనుక మంచి సక్సెస్ ను అందుకుంటే పూజాహెగ్డే రేంజ్ హాలీవుడ్ కి వెళ్తుంది అని చెప్పవచ్చు.

టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా స్టార్ హీరో విజయ్ సరసన బీస్ట్ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా పై ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకుందట. ఎందుకంటే తన పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని కూడా చెప్పుకొచ్చింది..

అయితే పూజకు మాత్రం గత కొద్ది సంవత్సరాల నుంచి ఒక పాత్రలో చేయాలని చాలా కోరిక ఉండేదట. ఆ పాత్ర ఏమిటంటే యాక్షన్ సీక్వెన్స్.. లో ఉండే పాత్ర చేయాలని అని ఉన్నప్పటికీ ఇప్పటివరకు అలాంటి అవకాశం లభించని లేదని తెలిపింది. బీస్ట్ సినిమాలోనైనా తనకు అలాంటి పాత్ర లభిస్తుందో ఏమో అని ఆశ పడుతోంది ఈ బుట్ట బొమ్మ. ఇప్పటికే పాన్ ఇండియా మూవీస్ లో ఈమె పాత్ర రొమాంటిక్ గా ఉండడంతో, ఇక్కడ సక్సెస్ అయితే తన రేంజ్ మరో పీక్స్ అందుకుంటుంది అని చెప్పవచ్చు.

అలాంటి పాత్ర చేయాలనుంది.. పూజా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts