గ‌ప్‌చుప్‌గా మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న ప్ర‌కాశ్ రాజ్‌..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మా` ఎన్నిక‌ల బ‌రిలో దిగిన త‌ర్వాత త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారీయ‌న‌. ఇదిలా ఉంటే.. తాజాగా ఈయ‌న ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా గ‌ప్‌చుప్‌గా మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇంత‌కీ ప్ర‌కాశ్ రాజ్ పెళ్లి చేసుకుంది ఎవ‌ర్నో తెలుసా.. ఆయ‌న భార్య పోనీ వర్మనే.

Image

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ప్రకాశ్‌రాజ్‌, పోని వర్మను పెళ్లి చేసుకుని నిన్న‌టికి 11 వసంతాలు పూర్తకావడంతో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ క్రమంలోనే కుమారుడు కోరిక మేరకు ప్ర‌కాశ్ రాజ్‌, పోని వ‌ర్మ రింగ్స్ మార్చుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, కొడుకు ముందే ముద్దుల్లో మునిగిపోయాడు ఈ జంట‌.

Image

ఇక ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసిన ప్ర‌కాశ్ రాజ్‌..‘మా వివాహానికి సాక్షిగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా, ప్రకాష్ రాజ్ మొదట డిస్కో శాంతి సోదరి లలిత కుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు క‌ల‌గ‌గా.. కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ త‌ర్వాత ల‌లిత‌కు విడాకులు ఇచ్చిన ప్ర‌కాశ్ రాజ్ బాలీవుడ్ డాన్సర్ పోనీ వర్మని 2010లో రెండో వివాహం చేసుకోగా.. వీరి వేదాంత్ అనే కుమారుడు ఉన్నారు.

Image

Image