జైల్లో ఉన్న నటికి బెయిల్ ఎందుకు నిరాకరించారు..!

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ తమ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అలా మాట్లాడితే చట్టం ఊరుకోదు కదా ? అయితే ప్రస్తుతం నటి, మోడల్ మీరా మిథున్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాపులర్ అయింది. అదికూడా అట్టడుగు వర్గాలను తన నోటి దురుసు తో మాట్లాడటం వల్ల,తాజాగా ఈమె ఆ కేసుకు సంబంధించి బెయిల్ విషయంలో.. నో అని తేల్చి చెప్పేసింది చెన్నై ప్రిన్సిపల్ స్టేషన్స్ కోర్టు.

ఈమె చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారడంతో కోర్టు ఆమె బెయిల్ కు నిరాకరించింది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దళితులను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఆమె చేసిన వ్యాఖ్యలను చాలా సీరియస్ గా తీసుకున్నారు VCK పార్టీ నేత వన్నియరసు. దాంతో ఆయన చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఆమె మీద కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న ఆమె.ఆమెను అరెస్టు చేస్తారని భయంతోనే కేరళలో వెళ్లి తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో.. దాంతో సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అరెస్టు చేశారు. అక్కడి నుంచి చెన్నైకి తీసుకువచ్చి రిమాండ్లో .. ఆమే స్నేహితుడు అభిషేక్ ఈ నటికి బెయిల్ రావాలని పిటిషన్ వేయగా.. అంత పరిశీలించి తన స్నేహితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది కోర్టు. ఇక ఈ అమ్మడికి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు అన్నట్టుగా అక్కడి మీడియా లో ఎక్కువగా వినిపిస్తోంది.