వీర్యం తీసిన కొద్ది సమయానికే దారుణం..?

కరోనా కారణంగా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న భర్త వీర్యం కావాలని ఓ భార్య కోర్టుకు ఎక్కింది. తనకు తన భర్త వల్లే పిల్లల్ని కనాలని ఉందని అందుకోసం భర్త వీర్యం కావాలని కోర్టును ఆశ్రయించింది. ఆ మహిళ కోరిక ప్రకారం ఆమె భర్త వీర్యాన్ని భద్రపరచాలని హైకోర్టు హాస్పిటల్ సిబ్బందిని ఆదేశించింది. అయితే వీర్యం తీసిన కొద్దిగంటల్లోనే కరోనాతో బాధపడుతున్న ఆ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ కు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది.

దాంతో అతడు హాస్పిటల్ లో చేరాడు. అనంతరం అత‌డి పరిస్థితి విషమించింది. వారికి పిల్లలు లేరు. పిల్లల్ని కంటే త‌న భ‌ర్త‌ తోనే కనాలని అతడి భార్య నిర్ణయించుకుంది. తన భర్త వీర్యం కావాలని హాస్పిటల్ ను కోరింది. కానీ అందుకు హాస్పిటల్ సిబ్బంది నిరాకరించడంతో ఆమె గుజ‌రాత్ హైకోర్టును ఆశ్రయించింది. అతడి వీర్యాన్ని భద్రపరచాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం హాస్పిటల్ సిబ్బంది అతడి వీర్యాన్ని తీసి భద్రపరిచారు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపట్లోనే అతడు మరణించాడు. ఐవిఎఫ్ పద్ధతిలో తాను పిల్లలను కంటాన‌ని..తన భర్త ప్రతిరూపంతో కాలం గడుపుతాను అంటూ ఆ మహిళ చెప్తోంది.