ప్ర‌భాస్ న‌యా రికార్డ్‌..ఉబ్బిత‌బ్బిపోతున్న ఫ్యాన్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌యా రికార్డ్ క్రియేట్ చేశారు. ఆసియా ఖండంలో నంబర్‌వన్‌ అందగాడిగా మ‌న డార్లింగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అవును, ఫ్యాన్సీ ఆడ్స్‌ అనే సంస్థ నిర్వహించిన టాప్‌ టెన్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్‌ ఏసియన్‌ మెన్ సర్వేలో ప్ర‌భాస్ ఫ‌స్ట్ ప్లేస్‌ను ద‌క్కించుకున్నాడు.

సౌత్‌ కొరియన్‌ స్టార్‌ కిమ్‌ హ్యూన్‌ జూంగ్‌, పాకిస్తాన్‌ నటులు ఇమ్రాన్‌ అబ్బాస్‌, ఫవాద్‌ ఖాన్‌ తదితరులను వెన‌క్కి నెట్టి ప్ర‌భాస్ మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకోవ‌డంతో.. ఆయ‌న ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బిత‌బ్బిపోతున్నారు.

కాగా, ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్‌, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ చిత్రాలు చేస్తున్నాడు. అలాగే వీటితో పాటుగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేసేందుకు కూడా ప్ర‌భాస్ ఓకే చెప్పాడు.