ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ను పెళ్లాడ‌బోతున్న త్రిష‌..త్వ‌ర‌లోనే..?

`నీ మనసు నాకు తెలుసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన త్రిష్‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక తెలుగులోనే కాకుండా త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం మ‌రియు హిందీ భాష‌ల్లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. త్రిష్ పెళ్లి విష‌యం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

గ‌తంలో వరుణ్‌ మణియన్‌ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిన త్రిష.. అతడితో నిశ్చితార్థం చేసుకుంది. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల వీరి పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ త‌ర్వాత ఓ తెలుగు హీరోతో ల‌వ్‌లో ఉంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అవి రూమ‌ర్లుగానే మిగిలిపోయాయి. అయితే ఓ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌తో త్రిష్ పెళ్లిపీట‌లెక్క‌బోతోంద‌నే ఓ వార్త ఇప్పుడు కోలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఓ సినిమా షూటింగ్‌ సమయంలో ఆ డైరెక్ట‌ర్ తో త్రిష ప్రేమ‌లో ప‌డింద‌ని.. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రు..? తాజా వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజ‌ముంది..? అన్న‌ది తెలియాల్సి ఉంది.