ఎన్టీఆర్ కాస్ట్లీ కార్ ధర చూసే షాక్ అవ్వాల్సిందే..!

హీరోలకి లగ్జరీ కారులంటే మహా సరదా. మార్కెట్ లోకి కొత్త లగ్జరీ కారు వచ్చింది అంటే అది వారి ఇంటికి చేరాల్సిందే. అలాంటి ఓ లగ్జరీ కారును జూనియర్ ఎన్టీఆర్ కొన్నాడు. ఖరీదైన ఇటాలియన్ లగ్జరీ లాంబోర్గిని కారు ఈపూట ఎన్టీఆర్ ఇంటికి చేరింది. ఈ కారు ధర దాదాపు మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఉంటుందట. అయితే తారక్ ఈ కారు కొన్నది తనకోసం కాదట ఆయన తల్లి ‘షాలిని’ కోసం ఈ కారును కొన్నాడని తెలిసింది.

అన్ని హంగులతో ఎంతో ప్రత్యేకంగా ఈ కారును ఎన్టీఆర్ తన తల్లి కోసం డిజైన్ చేయించాడు. ఇదిలా ఉంటె ప్రస్తుతం తారక్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో షూట్ లో పాల్గొంటున్నాడు. ఇంకోవైపు ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఆర్ఆర్ఆర్ బ్యాలెన్స్ షూట్ లో తారక్ పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. అది పూర్తి కాగానే డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా మూవీలో నటించనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన కియారాను ఎంపిక చేసినట్టు వార్తలు వినిపించాయి.