హ‌రితేజ కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా..పిక్స్ వైర‌ల్‌!

సీరియ‌ల్ న‌టిగా, టీవీ యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హ‌రితేజ‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో మ‌రింత పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ షో త‌ర్వాత హ‌రితేజ అనేక చిత్రాల్లో మంచి మంచి పాత్ర‌లు అందుకుంటూ దూసుకుపోతోంది.

 Hariteja : అది అలా ఉంటే ఇటీవల ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన హరితేజ తాజాగా తన కూతురు భూమి ఫోటోలను  సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.. Photo : Instagram

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మధ్యే కూతురికి బారసాల ఫంక్షన్‌ అయ్యిందని, చిన్నారికి భూమి దీపక్‌రావు అని నామకరణం చేసినట్లు వెల్లడించిన హరితేజ.. ఇప్పటివరకు పాప ఫోటోను రివీల్‌ చేయలేదు.

 Hariteja :  హరితేజ..తెలుగు వారికి బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎక్కువ పరిచయమైంది. అయితే అంతకంటే ముందు పలు సీరియల్స్‌, సినిమాల్లో కూడా నటించారు. నితిన్ హీరోగా సమంత హీరోయిన్‌గా 2016లో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అఆ' సినిమాలో మంగమ్మ పాత్ర హరితేజకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం హరితేజ సినిమాల్లో నటిస్తూనే..పలు టీవీ షోలకు యాంకరింగ్ కూడ చేస్తున్నారు. Photo : Instagram

దాంతో నెటిజ‌న్లు పాప‌ను చూపించ‌మంటూ త‌ర‌చూ అడుగుతుండ‌డంతో.. తాజాగా భూమి ఫొటోల‌ను రివిల్ చేసింది. ఇక ఈ ఫొటోల్లో హ‌రితేజ కూతురు ఎంతో క్యూట్‌గా ఉంది. ముద్దొస్తున్న భామిని చూపి నెటిజ‌న్లు, మ‌రియు బెల్లితెర ప్ర‌ముఖులు ముచ్చ‌ట‌ప‌డుతున్నారు. మ‌రి లేట్ చేయ‌కుండా మీరూ మిస్ భూమి దీప‌క్‌రావు పిక్స్‌పై ఓ లుక్కేసేయండి.

 Hariteja : కూతురు ఫోటోలను పంచుకున్న నటి హరితేజ.. Photo : Instagram

 Hariteja : కూతురు ఫోటోలను పంచుకున్న నటి హరితేజ.. Photo : Instagram