బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న వరుణ్ తేజ్..?

మెగా ఫ్యామిలీలో టాలెస్ట్ బాయ్ వరుణ్ తేజ్ కు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మెగా ఫ్యామిలీలో హీరోలంతా మాస్‌ సినిమాలు చేస్తూ వస్తుంటే వరుణ్‌ తేజ్ మాత్రం కాస్త భిన్నంగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాలు వరుసపెట్టి చేసేస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుటికే ఆయన తొలి ప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

ప్రస్తుతం వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో గని అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం వరుణ్‌ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ బాలీవుడ్‌ లోకి ఎంట్రీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సోనీ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థలో వరుణ్‌ ఈ మూవీ చేయనున్నాడు. ఈ మూవీని తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు సమాచారం.