అమీర్ ఖాన్ విడాకులపై కంగనా కామెంట్స్…?

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం కామనే. అయితే తాజాగా అమీర్ ఖాన్ విడాకులు తీసుకోవడంపై ఇప్పుడు ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. బిల్ గేట్స్ కూడా ఈ మధ్యనే తన భార్యతో విడాకులు తీసుకున్నారు. అయితే అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన తన మొదటి భార్య రీనాదత్తాతో విడాకులు తీసుకున్నాక 2005లో కిరణ్ రావును వివాహమాడాడు. 15 ఏళ్ళ పాటు వారి మధ్య ఏ విబేధాలు రాలేదు. అయితే సడన్ గా వారి కాపారురం పెటాకులయ్యింది. తన భార్యతో విడాకులు తీసుకోబోతున్న విషయాన్ని అమీర్ ఖాన్ తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

వారి విడాకులపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వారి విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పంజాబ్ ఒక కుమారుడిని సిక్కుగా పెంచితే, మరొక కొడుకును ముస్లిం గా పెంచేవాళ్లని అయితే ఇప్పుడు అమీర్ ఖాన్ మాత్రం రెండోసారి విడాకులు తీసుకున్నా కూడా ఆయన పిల్లలు ఎందుకు ముస్లింగా గుర్తించబడుతారనేది తన ఆశ్చర్యంగా అనిపిస్తోందని అన్నారు. ఒక మహిళ ఎందుకు హిందువుగా కొనసాగే అవకాశం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.