`ఆహా`లో ఒకేరోజు విడుద‌లైన 15 సినిమాలు..లిస్ట్ ఇదే!

తెలుగులో మొట్ట మొదటి ఓటీటీ సంస్థ ఆహా చాలా త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రతి వారం కొత్త కంటెంట‌తో ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్న ఆహా..మరోసారి సినీ ప్రేమికులకు సర్‏ప్రైజ్ ఇచ్చేసింది.

ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 చిత్రాల‌ను ఒకేసారి విడుద‌ల చేసింది. ఆహా ఒరిజిన‌ల్స్ పేరుతో వ‌రుస‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌ల విడుద‌ల‌కు నిర్వహకులు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే శుక్రువారం..యుద్ధం శరణం, అందాల రాక్షసి, దిక్కులు చూడకు రామయ్య, ఊహలు గుసగుసలాడే, ఈగ, బంగారు బుల్లోడు, భైరవ ద్వీపం, చిరు నవ్వుతో, ఘటోత్కచుడు, కొబ్బరి బొండం, రాజేంద్రుడు గజేంద్రుడు, వినోదం, వేటుగాడు, లీసా మొత్తం 15 సినిమాల‌ను విడుద‌ల చేశారు.

Image