ఫ్యామిలీ మ్యాన్‌-3..లైన్‌లోకి విజ‌య్ సేతుప‌తి?!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన వెబ్ సిరీస్‌ల‌లో ది ఫ్యామిలీ మ్యాన్ -1 ఒక‌టి. దీనికి కొనసాగింపుగా ఇటీవ‌ల వ‌చ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు అందుకుంది. రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన ఈ సిరీస్ లో మ‌నోజ్ బాజ్‌పాయ్‌తో పాటు కీల‌క పాత్ర పోషించిన అక్కినేని వారి కోడ‌లు స‌మంత అద‌ర‌గొట్టేసింది.

ఇక‌ ఫ్యామిలీ మ్యాన్‌-3 ఉంటుందని ఈ వెబ్‌ షో క్రియేటర్లు, దర్శకద్వయం రాజ్‌-డీకే స్పష్టం చేశారు. కాన్సెప్ట్‌ సిద్ధంగా ఉంది కానీ కథపై కూర్చోవాలని చెప్పారు. అయితే ఫ్యామిలీ మాన్ 2 కోసం సమంతను రంగంలోకి దించిన రాజ్-డీకే.. ఈ సారి ఫ్యామిలీ మాన్ 3కు మరో సౌత్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకుంటున్నార‌ట‌.

నిజానికి ఫ్యామిలీ మ్యాన్‌-2 లోనే శ్రీలంకలోని తమిళ నాయకుడి పాత్రలో నటించాల్సిందిగా విజయ్‌ సేతుపతిని రాజ్‌-డీకే సంప్రదించారు. కానీ, అప్పుడు ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇప్పుడు మూడో సీజన్‌లో ఓ కీల‌క పాత్ర కోసం నటించమని కోరగా.. విజ‌య్ సేతుప‌తి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో చూడాలి.