ప్రేమ‌లో ప‌డిన ర‌ష్మిక..ఎవ‌రితో అంటే?

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. త‌క్క‌వ స‌మ‌యంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు హిందీ, కన్న‌డ‌, త‌మిళ చిత్రాల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. ర‌ష్మిక ప్రేమ‌లో ప‌డింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. ర‌ష్మిక ఎవ‌రితో ప్రేమలో ప‌డింది..? అనేగా మీ డౌట్.. అక్క‌డికే వ‌స్తున్నా. ర‌ష్మిక ప్రేమ‌లో ప‌డింది.. త‌న పెట్ డాగ్ ఆరాతో. ఇటీవలే రష్మిక ఓ కుక్కపిల్లను పెంచుకోవడానికి ఇంటికి తెచ్చారు. దానికి ఆరా అనే పేరు కూడా పెట్టారు.

తాజాగా ఆరాను అభిమానుల‌కు ప‌రిచ‌యం చేస్తూ.. ఎవరితోనైనా ప్రేమలో పడేందుకు మూడు సెకన్లు చాలని అంటారు. కానీ ఆరా మాత్రం 0.3 సెకండ్లలోనే నా హృదయాన్ని గెలుచుకుంది అంటూ ర‌ష్మిక పేర్కొంది. మ‌రియు కొన్ని ఫొటోల‌ను కూడా షేర్ చేసింది. దాంతో ర‌ష్మిక పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

Rashmika Mandanna is now a pet parent, shares cute pics of pup Aura -  Movies News