హ‌ఠాత్తుగా పెళ్లి చేసుకోవ‌డానికి అదే కార‌ణ‌మంటున్న ప్రణీత!

June 15, 2021 at 8:54 am

ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ ప్రణీత సుభాష్.. బావ సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత అత్తారింటికి దారేది చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది ఈ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న హంగామా 2లో ప్ర‌ణీత న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్యే ప్ర‌ణీత సైలెంట్‌గా ప్రియుడు నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎవ‌రికీ చెప్ప‌కుండా ఇంత హ‌ఠాత్తుగా ప్ర‌ణీత పెళ్లి చేసుకోవ‌డానికి కార‌ణం ఏంటీ అన్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు. ఈ విష‌యంపై తాజాగా ప్ర‌ణీత వివ‌ర‌ణ ఇచ్చింది.

తాజాగా ప్ర‌ణీత ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకకు ప్లాన్‌ చేశామని..అయితే జూలై నెలలో ఆషాఢమాసం వస్తుండటంతో పాటు ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అనే అపనమ్మకంతో స‌డెన్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింద‌ని చెప్పుకొచ్చింది. అలాగే సమాజం మొత్తం సంక్షోభంలో ఉన్నప్పుడు అనవసర విలాసాల జోలికి వెళ్లొద్దనే భావనతో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నామ‌ని ప్ర‌ణీత పేర్కొంది.

హ‌ఠాత్తుగా పెళ్లి చేసుకోవ‌డానికి అదే కార‌ణ‌మంటున్న ప్రణీత!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts