అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్ర‌భాస్..!

ప్ర‌భాస్ అంటే ఒక‌ప్పుడు టాలీవుడ్‌కు మాత్ర‌మే ప‌రిమితం. కానీ బాహుబ‌లి త‌ర్వాత ఆయ‌న నేష‌నల్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు అన్ని భాష‌ల హీరోయిన్ల‌కు ఆయ‌న మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు అయితే ఆయ‌న‌తో సినిమా చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్ప‌టికే సాహోలో శ్ర‌ద్ధా క‌పూర్‌, ఇప్పుడు స‌లార్‌లో శృతిహాస‌న్ న‌టిస్తోంది.

అలాగే ఆదిపురుష్‌లో హిందీ భామ కృతిస‌న‌న్ చేస్తోంది. ఇలా వ‌రుస పెట్టి హిందీ భామ‌లు ప్ర‌భాస్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. ప్ర‌భాస్ అంటే ఆర‌డుగుల అంద‌గాడు. మోస్ట్ వాంటెడ్ బ్యాచిల‌ర్‌గా కూడా అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మారాడు. ఇక సౌత్ మొత్తం నుండి ఏ హీరోకు రాని అరుదైన గుర్తింపు ప్రభాస్ సొంతం చేసుకున్నారు. టాప్ 10 సెక్సీఎస్ట్ మెన్ ఇన్ ఏషియా జాబితాలో సౌత్ నుండి స్థానం సంపాదించుకున్న ఏకైక మొద‌టి హీరోగా డార్లింగ్ నిలిచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరోకు ద‌క్క‌ని క్రేజ్‌ను ప్ర‌భాస్ సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో ప్ర‌భాస్ ప‌దోస్థానంలో నిలిచారు. కాగా మొద‌టి స్థానంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ నిలిచారు.