హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న రాజమౌళి..?

June 2, 2021 at 6:06 pm

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు ప్రపంచమంతటా మారుమ్రోగిపోయింది. అయితే ఇప్పుడు రాజమౌళి హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆయన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కమెడియన్ ఆలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. రాజమౌళి కోసం తాను ఓ కథ రాశానని, ఆ సినిమాను హాలీవుడ్‌ లో నిర్మించబోతున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆ సినిమా లైవ్ యానిమేషన్ సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు, ఆ సినిమాను హాలీవుడ్ స్టూడియో సహకారంతో నిర్మించబోతున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

ఆ సినిమాలో హాలీవుడ్ స్టార్స్, ఇండియన్ స్టార్స్ ఎవరూ ఉండరని, భారతీయ కంటెంట్‌ తో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాం అని తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ లు, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆకట్టుకున్నాయి. రాజమౌళి మహేష్ బాబుతో కూడా ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న రాజమౌళి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts