బిగ్ బాస్ దివి కి ఎలాంటి మొగుడు కావాలంటే…?

బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. తాజాగా ఈమె తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. ముక్కుసూటిగా ఉంటూ ఉన్నదున్నట్లు చెప్తూ 50 రోజుల పాటు గేమ్ ఆడి ఎలిమినేట్ అయింది దివి. ప్రస్తుతం దివి ప్రేమకథ గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలే వినిపిస్తున్నాయి. ఈమె అందాల వలకు కుర్రళ్ల మతులు చెడిపోతున్నాయి. గతంలోనే ఈమె మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రంలో నటించింది. తన లవర్ తో బ్రేకప్ తర్వాత తన లైఫ్‌లో ఎవరు లేరని సింగిల్‌గా ఉండటమే బాగుందని చెప్పింది. తన హైట్ 5.8 అని, కాబట్టి తనను చేసుకునేవాడు 6.3 ఉండాలని కండీషన్ పెడుతుంది. దాంతో పాటు తనను బాగా చూసుకోవాలని.. కష్టసుఖాల్లో తోడుగా ఉండాలని తెలిపింది. కష్టపడే మనస్తత్వం కలవాడైతే అన్నింటికంటే మంచిది అంటుంది. ఈ లక్షణాలన్నీ ఉన్న అబ్బాయినే దివి మొగుడుగా చేసుకుంటానంటుంది.