2020-21 కు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల…!

ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా ఏ స్థాయిలో అల్ల‌కల్లోలం సృష్టిస్తుందో చూస్తేనే ఉన్నాం. ఇలాంటి టైమ్‌లో కూడా ప్ర‌భుత్వం 2021-22 రాష్ట్ర క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించింది. సీఎం జ‌గ‌న్ దీన్ని విడుద‌ల చేశారు. ఈ సంవ‌త్స‌రంలో 10,143 ఉద్యోగాల‌ను భర్తీ చేస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అలాగే ఈ ఉద్యోగాల‌ను అత్యంత పారదర్శకంగా నియ‌మ‌కాలు పూర్తి చేస్తామ‌ని తెలిపారు. అవినీతికి అవ‌కాశం లేకుండా కేవ‌లం మెరిట్ ఆధారంగానే వీటిని భ‌ర్తీ చేస్తామ‌న్నారు.

రాష్ట్రంలో ఇప్ప‌టి దాకా 6,03,756 ఉద్యోగాల‌ను భర్తీ చేసిన‌ట్టు జ‌గ‌న్ వెల్ల‌డించారు. .జులైలో 1238 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని, అలాగే ఆగ‌స్టులో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 లో ఉన్న 36పోస్టుల‌ను పూరిస్తామ‌న్నారు. ఇక అక్టోబ‌ర్‌లో వైద్య‌శాఖ‌లో ఉన్న 451ఉద్యోగాల‌ను, అలాగే డిసెంబ‌ర్ నెల‌లో 441 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ఇక 2022మార్చిలో వివిధ శాఖ‌ల్లో ఉన్న 35 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఎలాంటి అవినీతి లేకుండా వీటిని పూర్తి చేస్తామ‌ని తెలిపారు జ‌గ‌న్‌.