వ్యాక్సినేషన్ విషయంలో కొత్త మార్గదర్శకాలు

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖకు నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటిని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం.. అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం..కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు నెగెటివ్ వచ్చిన 3 నెలల తర్వాతే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి కరోనా వస్తే వారికి పూర్తిగా తగ్గిన తర్వాతే మళ్లీ సెకండ్ డోస్ తీసుకోవాలి. వ్యాధి నుంచి కోలుకున్న 3 నెలల తర్వాత మళ్లీ టీకా వేయించుకోవాలి. తీవ్రమైన అనారోగ్య సమస్యలున్న వారు, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారు టీకా వేసుకోకపోవడమే మంచిది. 4-8 వారాల తర్వాత టీకా వేసుకోవాలి. పాలిచ్చే తల్లులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోకుండా కోవిడ్ టీకాను వేసుకోవచ్చు. గర్భిణీలు మాత్రం వ్యాక్సిన్ తీసుకోకూడదు. కరోనా నుంచి కోలుకున్న వారు నెగెటివ్ వచ్చిన 14 రోజుల తర్వాత రక్త దానం చేయవచ్చు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా 14 రోజుల తర్వాత తమ రక్తాన్ని దానం చేయవచ్చు.