ఫ‌స్ట్ రౌండ్ రిజ‌ల్ట్ తో ప‌న‌బాక షాక్‌.. కౌంటింగ్ కేంద్రం నుంచి..

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. వార్ వ‌న్ సైడే అన్న‌ట్లుగా ఉంది ప‌రిస్థితి. వైఎస్ ఆర్సీపీ దూసుకుపోతున్న‌ది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండడంతో రెండు చోట్ల కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజ కవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్న మెంట్‌ మహిళా కళాశాలలో జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో కౌంటింగ్‌ ఏర్పాట్లు చేశారు.

ఇదిలా ఉండ‌గా తొలుత‌ పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించినా ఆ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌లేదు. అయితే తొలిరౌండ్ ఫ‌లితాల‌ను చూసి ప్ర‌తిప‌క్ష టీడీపీ దిమ్మదిరిగిపోతున్న‌ది. మొద‌టి రౌండ్‌లో మొత్తం 3వేల ఓట్ల‌ను లెక్కించ‌గా అందులో 2500 మొత్తంగా వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి ఖాతాలో ప‌డ‌డం గ‌మ‌నార్హం. దీంతో వార్ వ‌న్‌సైడ్‌గా మారిపోయింది. ఇక ఫ‌స్ట్ రౌండ్ ఫ‌లితాల‌ను చూసిన అనంత‌రం టీడీపీ అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మీ కౌంటింగ్ కేంద్రం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. దీంతో ఓట‌మీని అంగీక‌రించిన‌ట్లుగానే ఖాయ‌మైపోయింది. మ‌రోవైపు వైసీపీ ఎంత మేర‌కు మెజార్టీ సాధిస్తుంద‌నే దానిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ కొన‌సాగుతున్న‌ది.