మన దేశంలో ఏ యాప్ కి ఎక్కువ యూజర్లు ఉన్నారంటే..?

May 27, 2021 at 4:42 pm

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్ ల వాడకం పెరిగిపోయింది. దీంతో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి యాప్ లు ఉంటాయి. కొంతమంది ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

భారత్ లో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి మన దేశంలో ఏ యాప్ ను ఎంత మంది వాడుతున్నారో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాట్సాప్ ను మన దేశంలో 53 కోట్ల మంది వినియోగిస్తుండగా.. ఆ తర్వాత స్థానంలో యూట్యూబ్ ను 44. 8 కోట్ల మంది వాడుతున్నారు. ఫేస్ బుక్ ను 41 కోట్ల మంది ఉపయోగిస్తుండగా.. ఇన్ స్టాగ్రామ్ ను 21 కోట్ల మంది యూజ్ చేస్తున్నారు. ట్విట్టర్ ను 1.75 కోట్ల మంది మాత్రమే వినియోగిస్తున్నారు. దేశంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న యాప్ గా వాట్సాప్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది.

మన దేశంలో ఏ యాప్ కి ఎక్కువ యూజర్లు ఉన్నారంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts