విమానంలో రెచ్చిపోయిన జంట.. ముద్దుల వర్షం..!

May 27, 2021 at 4:31 pm

మనం బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. అక్కడ ఎవరైనా వింతగా ప్రవర్తిస్తే మనం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. తాజాగా కరాచీ నుంచి ఇస్లామాబాద్ కు వెళుతున్న పీఏ200 విమానంలో ప్రయాణించే వారికి కూడా ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రేమ జంట విమానంలో ఇతర ప్రయాణికులు కూడా ఉన్నారన్న విషయాన్ని మరిచి ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన ఆ జంట విమానంలో అలా చేయడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ జంట అలా ముద్దుల పనిలో మునిగిపోవడంతో వారి వెనుక కూర్చున్న వ్యక్తికి ఇబ్బందిగా అనిపించింది. దీంతో అతడు ఎయిర్ హోస్టెస్ కి వారి తీరుపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ విమానంలో ఇలా చేయొద్దని, ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుందని ఆ జంటకు చెప్పారు. ఎంత చెప్పినా ఆ జంట అలానే ముద్దుల్లో మునిగిపోవడంతో ఎయిర్ హోస్టెస్ వారికి ఒక దుప్పటి ఇచ్చి వెళ్లిపోయారు. అయితే అదే విమానంలో బిలాల్ అనే న్యాయవాది కూడా ప్రయాణం చేస్తున్నారు. ఈ జంట చేసిన పనికి వారిపై చర్యలు తీసుకోలేదని అతడు విమాన సిబ్బందిపై సివిల్ ఏవియేషన్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. దీంతో మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ ఆ విమాన సంస్థను సీపీఏ హెచ్చరించింది.

విమానంలో రెచ్చిపోయిన జంట.. ముద్దుల వర్షం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts