14 గంటల పాటు నిలవనున్న NEFT సేవలు..?

తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన సమాచారం మేరకు మే 23 వ తేది ఆదివారం నాడు దాదాపు 14 గంటలపాటు NFET సేవలు నిలిచిపోనున్నట్లు తెలియజేశారు. కేవలం సాంకేతిక కారణాల కారణంగా ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆర్బిఐ తెలియజేసింది. టెక్నికల్ అప్గ్రేడ్ కొరకు మే 22 వ తేదీన బ్యాంక్ సమయం ముగిసిన తర్వాత సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కోసం మే 22 అర్ధరాత్రి 12 గంటల నుండి మే 23 మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని తెలియజేసింది.

ఇక ఆర్టిజిఎస్ సేవల విషయానికి వస్తే.. అందులో ఎటువంటి మార్పులు ఉండబోవని అవి యధావిధిగా కొనసాగుతాయని ఆర్.బి.ఐ తెలియజేసింది. ఈ విషయాన్ని గ్రహించి బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్త వహించాల్సిందిగా కోరింది. 2019 డిసెంబర్ నెల నుండి NFET సేవలు నిరంతరాయంగా అందుబాటులోకి తీసుకోచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.