గుడ్‌న్యూస్ చెప్పిన మ‌హేష్ బాబు..ఖుషీలో ఫ్యాన్స్‌!

May 1, 2021 at 7:25 pm

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారు పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఉంటుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ మ‌హేష్ గుడ్‌న్యూస్ చెప్పాడు. త్రివిక్ర‌మ్‌, మహేష్‌ బాబు కాంబినేషన్లోని మూడో సినిమాకి రంగం సిద్ధమైంది.

మ‌హేష్‌కు ఇది 28వ చిత్రం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగు మొదలవుతుందనీ, వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నామని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

గుడ్‌న్యూస్ చెప్పిన మ‌హేష్ బాబు..ఖుషీలో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts