చిరంజీవి అల్లుడితో ఉప్పెన డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. విజేత సినిమాతో హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడీయ‌న. ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించ‌గా.. క‌ళ్యాణ్ దేవ్ రెండో చిత్రంగా సూపర్‌ మచ్చి చేశాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

ఇక ప్ర‌స్తుతం ఈయ‌న అశ్వద్ధామ ఫేమ్ రమణతేజ ద‌ర్శ‌క‌త్వంలో కిన్నెరసాని సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ద‌శలో ఉంది. అయితే క‌ళ్యాణ్ దేవ్ త్వ‌ర‌లోనే ఉప్పెన సినిమాతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ట‌.

ఈ ప్రాజెక్ట్‌పై ఇటీవ‌లె చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని.. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది.