విజయ్‌ దేవరకొండ న్యూ రికార్డ్..సౌత్‌లోనే ఏకైక హీరోగా..!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ రౌడీ హీరో.. ఆ స్టేట‌స్‌ను అలాగే మెయిన్‌టైన్ చేస్తున్నాడు. విజ‌య్ సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. ఈయ‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.

నిజానికి విజ‌య్ వ్యక్తిత్వం, యాటిట్యూడ్‌, స్టైల్ న‌చ్చే..ఆయ‌న‌కు చాలా మంది అభిమానులుగా మార‌తుంటారు. ఈ క్ర‌మంలోనే సోషల్ మీడియాలో రోజురోజుకూ ఆయ‌న‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అయితే తాజాగా విజ‌య్ ఓ న్యూ రికార్డ్ క్రియేట్ చేశాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో విజ‌య్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య 12 మిలియ‌న్ల‌కు చేరుకుంది

దీంతో దక్షిణాది స్టార్‌ హీరోలకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌తో విజయ్‌ ముందంజలో ఉన్నాడు. మిగతా హీరోలు అల్లు అర్జున్ (11.8), మహేష్ బాబు (6.7), ప్రభాస్ (6.5), రామ్ చరణ్ (3.9), ఎన్టీఆర్ (2.6)కు ‍కన్నడ స్టార్‌ హీరోలైన యశ్‌(5) మిలియన్ల ఫాలోవర్స్‌ ఉండగా వీళ్లందరిని వెనక్కి నెట్టి విజయ్‌ 12 మిలియన్ల ఫాలోవర్స్‌తో నెంబర్ వన్ హీరోగా మారిపోయాడు.