ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి కూడా కన్ఫార్మ్ చేసేశాడు.
అయితే ఈ చిత్రంలో బాలయ్య పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో బాలయ్య రైతుగా కనిపిస్తారట. ఆయన పాత్ర పేరు రామారావు అనీ, ఆ ఊళ్లో అంతా రామారావుగారూ అని ఆప్యాయంగా పిలుస్తారట. అంతేకాదు, ఈ చిత్రం మొత్తం పల్లె వాతావరణంలో సాగుతుందని నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది. కాగా, అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో ఎఫ్ 3 చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.